telugu navyamedia
సినిమా వార్తలు

“బ్యాక్ డోర్” విడుదల వాయిదా..

నటి పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగానంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ సినిమా విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు “కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్” అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకోవడం తెలిసిందే.

కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ…”బ్యాక్ డోర్” చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు… భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున ఈనెల 3 బదులుగా ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

Related posts