telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కారవాన్ అనేది కనీస అవసరాలకు మాత్రమే… చిరంజీవి, తమ్మారెడ్డి కామెంట్స్

chiru

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వాడే కారవాన్‌లపై చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ.. పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇన్నేళ్లలో సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. నేను శంకర్ దాదా జిందాబాద్ చేస్తున్న సమయంలో మాకు కారవాన్‌లు లేవు. అప్పట్లో లేడీస్‌కు కారవాన్ ఉంటే బావుండేది అనుకున్నాను. కారవాన్ అనేది కనీస అవసరాలకు మాత్రమే వాడుకుంటే బాగుంటుంది. ఒక వేళ కారవాన్‌లో కూర్చోన్న ఆర్టిస్ట్‌ను షూటింగ్‌కు పిలవడానికి అసిస్టెంట్ డైరెక్టర్ జీవితం అక్కడే అయిపోతుంది. అతనికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఈ విషయమై ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు రావాలన్నారు. షూటింగ్‌లో గ్యాప్ దొరికితే మాత్రం నేను లొకేషన్‌లో ఉంటాను. అలా ఉండటం వలన వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. మనం వెళ్లి రిలాక్స్ అయితే మిగతావాళ్లు కూడా అలాగే రిలాక్స్ అయిపోతారు. ఆ ఎఫెక్ట్ సినిమా ఔట్‌పుట్ పై పడుతుంది. దీనితో పనిదినాలు పెరిగిపోతాయి. వర్క్ డేస్ పెరగడం వల్ల బడ్జెట్ కూడా అదుపు తప్పుతుంది” అన్నారు.

దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. చిరంజీవి చెప్పినట్లు కారవాన్‌లో వెళ్లి కూర్చొని.. పిలిచినపుడు వెళదాం అనే నిర్లక్ష్యంతోనే చాలా మంది హీరో, హీరోయిన్లు ఉన్నారు. ఒక అసిస్టెంట్ దర్శకుడు 20 ఏళ్ల వయసులో ఏదైనా నేర్చుకుందామని ఇండస్ట్రీకి వస్తాడు.అలాంటి వాళ్లు కారవాన్‌‌ల వల్ల హీరోలు, హీరోయిన్లను పిలవడానికే పరిమితమయ్యారు. వాళ్లు పిలిస్తే తొందరగా వీళ్లు బయటకు రారు. వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తోంది. దీంతో వాళ్లు ఇండస్ట్రీలో ఏమి నేర్చుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అందరు ఈ విషయాన్ని గమినిస్తే ఇండస్ట్రీలో కొత్త దర్శకులు వస్తారు. అలా ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది” అన్నారు.

Related posts