వివాదాస్పద తమిళ హీరో శింబు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. శింబు నిర్మాతలని ఆడుకుంటాడని అభియోగం కూడా ఉంది. ఇప్పటి వరకు ఆయన మీద ఎందరో దర్శక నిర్మాతలు, హీరోయిన్లు కంప్లైంట్ చేశారు. చాలా మంది దర్శక నిర్మాతలు అతనితో గొడవలు పెట్టుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఏఏఏ సినిమా నిర్మాతలకి చాలా ఇబ్బంది పెట్టాడని ఆ నిర్మాతలే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అయితే ఒకానొక దశలో శింబుని బ్యాన్ చేయాలనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా శింబు మరోసారి ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. శింబుపై గతంలో ఆరోపణలు చేసిన నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా మరొసారి అతనిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తూ, అతన్ని చిత్ర పరిశ్రమ నుండి నిషేధించాలని కోరాడు. దానికి గల కారణా. గత ఏడాది శింబుతో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా షూటింగ్ కి సరైన సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టాడట. అంతేకాదు కొన్ని సార్లు అసలు షూటింగ్ కే వచ్చేవాడు కాదు. దీనివల్ల ఆ నిర్మాతకి చాలా నష్టం వచ్చిందని ఆరోపించాడు. అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్ కూడా శింబుపై ఆరోపణలు చేసింది. శింబుతో సినిమా చేయడం వల్ల తమకు 16 కోట్ల నష్టం వచ్చిందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంత పెద్ద నిర్మాణ సంస్థ కూడా శింబుపై ఆరోపణలు చేయడంతో నిర్మాతల మండలి ఆలోచనలో పడ్డారట. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
next post