telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ షూటింగ్

Vijay-Devarakonda

సెన్సేష‌న‌ల్ హీరో, రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న “డియర్ కామ్రేడ్” చిత్రం ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts