telugu navyamedia
సినిమా వార్తలు

హీరోయిన్ ను నైట్ క్లబ్ నుంచి గెంటేసిన నిర్వాహకులు…!?

Ananya-Pandey

ఇటీవల విడుదలైన “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2” చిత్రంతో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అనన్య పాండే. క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అన్పించేసుకుంది. ఇప్పుడు మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పార్టీలు, పబ్బులు అంటూ ఎలా తిరుగుతారో అందరికీ తెలిసిందే. అలా స్నేహితులతో కలసి నైట్ క్లబ్ లో పార్టీ చేసుకోవాలని వెళ్లిన అనన్య పాండేకు చేదు అనుభవం ఎదురైంది. అనన్య పాండేని ఆ నైట్ క్లబ్ సిబ్బంది గెంటేశారు. సదరు నైట్ క్లబ్ యాజమాన్యం దీని గురించి వివరణ ఇచ్చింది. మా క్లబ్ లో ఓ నిబంధన ఉంది. వయసు 24 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వారిని అనుమతించం. అందుకే అనన్య పాండేని అనుమతించలేదు అని యాజమాన్యం తెలిపింది. అనన్య పాండే వయసు కేవలం 20 ఏళ్ళు. ఇక చేసేది లేక నిరాశతో క్లబ్ నుంచి వెనుదిరిగింది.

Related posts