telugu navyamedia
సినిమా వార్తలు

 నీ ఊహని…

prema kosam poetry corner

ఎప్పుడో నువ్వు
చదువుతావనే  ఆశతో
రాసుకున్న అక్షరాన్ని….

ఎక్కడో తారసపడ్డప్పుడు 
నీకై తళుక్కున
మెరిసే తారకని….

నీకై  హృదయాన్ని
పంచుకున్న
వర్తమానాన్ని…

ఊపిరిలో బంధీనైన
నీ ఊహని…నేను
నీ  తలపుని…..

రేపటి పొద్దుకై
ఆకాశంలో రెక్కలు
విప్పుకున్న విహంగాన్ని..

-అమృత వల్లి, అవధానం

Related posts