telugu navyamedia
సినిమా వార్తలు

బ్యాలెట్ .. బుల్లెట్..

ballet bullet poetry corner
అందరూ ….
అవినీతి గురించి మాట్లాడేవారే,
అవినీతిని అంతమొందిస్తానని,
ప్రగల్భాలు పలికేవాళ్ళే,
నీతి గురించి …
అతిగా మాట్లాడే …
అవినీతిపరులే ….!
నిజాయితీని …
నిరూపించుకునే దిశలో,
నిరాశ పాలవుతుంటారు,
మడికట్టుకున్న మహాత్ముల్లా,
ప్రజలముందు ….
కొంగ జపం చేస్తూంటారు !
లంచాలకు లోటులేదు,
హత్యా కేసులకు అంతం లేదు,
భూకబ్జాలకు పరిమితి లేదు,
చేయని మోసమంటూ ఏమీలేదు,
ప్రజాసేవ చేస్తానంటాడు వీడు….!
బరితెగించిన 
ఈ బడా బాబుల్ని,
బ్యాలట్ తోనే ఎదిరించాలి,
సమసమాజ నిర్మాణం కోసం,
ఈ కలుపు మొక్కలను ..
మూలాలతో సహా పెకిలించాలి !!
-డా.కె .ఎల్.వి.ప్రసాద్, హనంకొండ.

Related posts