telugu navyamedia
సినిమా వార్తలు

దాసరి, చిరంజీవి, అమితాబ్, సోనూసుద్,కె.సి.ఆర్‌ పక్కనే నేను– నటుడు ఆలీ

అక్టోబర్‌ 10వ తేది నటుడు ఆలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులతో పాటు ఆలీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం నిర్వహించి, భారీ కేక్‌ను కట్‌చేసి తమ ఆనందాన్ని తెలియచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్‌ సభ్యులు మాట్లాడుతూ– కోవిడ్‌ టైమ్‌లో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో కూడా మా సభ్యులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని ఎన్నోసార్లు మాకు సాయం చే శారు.

దాసరి, చిరంజీవి, అమితాబ్, సోనూసుద్,కె.సి.ఆర్‌ పక్కనే నేను– నటుడు ఆలీ - IndustryHit.Com

మా యూనియన్‌లో 840మంది సభ్యులు ఉంటే ఆ సభ్యుల్లో ఎవరైనా ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఆలీగారి దగ్గరనుండి 10,000 రూపాయిల సాయం అందుతుంది. ఇప్పటివరకు ఆయన మాట ఇచ్చినట్లుగానే దాదాపు 100మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంచేశారు. నిండునూరేళ్లు ఇలానే ఆయన పుట్టినరోజులు చేసుకుంటూ నలుగురికి సాయం చేయాలని మా యూనియన్‌ తరపున ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాం’’ అన్నారు. జుబేదా ఆలీ మాట్లాడుతూ–‘‘ సినిమా పరిశ్రమలో అందరికంటే ముందు నిద్రలేచి, ఆలస్యంగా ఇంటికి చేరి లేటుగా నిద్రపోయేవారే డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు. ఆ సభ్యులు మా ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ఆలీ మాట్లాడుతూ– ‘‘ ఈ రోజు నేను 52వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. ఇంతమంది నా జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేస్తుంటే నాకు మాటలు రావటంలేదు.

What is the net worth of Indian actor Ali Basha

నేను నా సంపాదనలోనుండి డ్రైవర్స్‌ యూనియన్‌కే కాదు సినిమా పరిశ్రమలోని ఎన్నో యూనియన్‌లకు సాయం చేయటానికి ఎప్పుడు ముందుంటాను అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ యూనియన్‌ ఆఫీస్‌కి వెళిçతే అక్కడ దాసరి నారాయణరావు, చిరంజీవి, అమితాబచ్చన్, సోనూసుద్‌ కె.సి.ఆర్‌ గార్ల ఫోటోల పక్కన నా ఫోటో కూడా ఉంటుంది. అందుకే డ్రైవర్స్‌ యూనియన్‌ అంటే నాకు ప్రత్యేకాభిమానం’’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ చిత్ర నిర్మాత కొణతాల మోహన్‌ పాల్గొని మాట్లాడుతూ– ఆలీ లాంటి మంచి మనిషితో సినిమా చేయటం నిజంగా నా అదృష్టం’’ అన్నారు. బాబాఆలీ, కరీమ్‌.‘జోష్‌’ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దాసరి, చిరంజీవి, అమితాబ్, సోనూసుద్,కె.సి.ఆర్‌ పక్కనే నేను– నటుడు ఆలీ
అక్టోబర్‌ 10వ తేది నటుడు ఆలీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులతో పాటు ఆలీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానం నిర్వహించి, భారీ కేక్‌ను కట్‌చేసి తమ ఆనందాన్ని తెలియచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్‌ సభ్యులు ఆర్‌ రాధాకృష్ణ, లడ్డూపాషా, అశోక్‌లు మాట్లాడుతూ– కోవిడ్‌ టైమ్‌లో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో కూడా మా సభ్యులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని ఎన్నోసార్లు మాకు సాయం చే శారు. మా యూనియన్‌లో 840మంది సభ్యులు ఉంటే ఆ సభ్యుల్లో ఎవరైనా ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ఆలీగారి దగ్గరనుండి 10,000 రూపాయిల సాయం అందుతుంది.

Telugu Comedian Ali files case against impostor

ఇప్పటివరకు ఆయన మాట ఇచ్చినట్లుగానే దాదాపు 100మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంచేశారు. నిండునూరేళ్లు ఇలానే ఆయన పుట్టినరోజులు చేసుకుంటూ నలుగురికి సాయం చేయాలని మా యూనియన్‌ తరపున ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాం’’ అన్నారు. జుబేదా ఆలీ మాట్లాడుతూ–‘‘ సినిమా పరిశ్రమలో అందరికంటే ముందు నిద్రలేచి, ఆలస్యంగా ఇంటికి చేరి లేటుగా నిద్రపోయేవారే డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు. ఆ సభ్యులు మా ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ఆలీ మాట్లాడుతూ– ‘‘ ఈ రోజు నేను 52వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. ఇంతమంది నా జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేస్తుంటే నాకు మాటలు రావటంలేదు.

Happy Birthday Ali: Do you know these facts about Tollywood laughter  Katravalli 'Ali' .. - Business League

Related posts