telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జులై2న వస్తున్న షేర్షా…

కరోనా కారణంగా అన్ని పరిశ్రమతో పాటుగా సినీ పరిశ్రమ కూడా చాలా నష్టపోయింది. అయితే తాజాగా థియేటర్లకు వందశాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంతో బాలీవుడ్ వరుస సినిమాలను విడుదల చేస్తోంది. ఇటీవల యశ్ రాజ్ ఫిలింస్ వారు ఐదు సినిమాల విడుదల తారీకులను ప్రకటించారు. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరోల్లో ఒకడైన సిద్దార్థ్ మల్హోత్రా తాజా సినిమా కూడా విడుదలకు సిద్దమయింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా 1999లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్దంలో శత్రువలను చంపుతూ ప్రాణ త్యాగం చేసిన వీర జవాను విక్రమ్ భట్రా ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని విష్ణు వర్థన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇందులో కియారా ప్రధాన పాత్ర విక్రమ్ భట్రా భార్య డింపుల్ చీమా పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జులై2న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వారి అంచనాలను సిద్దార్థ్ ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి మరి.

Related posts