telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమ్మరాజ్యంలో కడప రెడ్లు… మోషన్ పోస్టర్ రిలీజ్

KRKR

ఇటీవల “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకున్న వ‌ర్మ ఈ చిత్రంలో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుని కాస్త నెగెటివ్ కోణంలో ఆవిష్క‌రించారు. ఇక ఇప్పుడు “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమాతో మరో సంచలనం సృష్టించబోతున్నాడు. టైగర్‌, ప్రొడక్షన్‌ కంపెనీ, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ చిత్రం చిత్రీకరణలో ఇప్పుడు వర్మ బిజీగా ఉన్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో పవన్ ఫోటో పోస్ట్ చేసి .. “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” సినిమాలో ఈ కొత్త నటుడు ఏ నిజ జీవిత పాత్ర చేస్తున్నాడో చెప్పగలరా?” అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు కొద్ది సేప‌టి క్రితం ఫ‌స్ట్ లుక్ లోగో పోస్ట‌ర్‌కి సంబంధించి మోష‌న్ వీడియో రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప‌లు సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రంతో ఏం చేయబోతున్నాడో చూడాలి.

Related posts