telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈ నెల 20 తరువాత పాక్షికంగా నిబంధనల సడలింపు: కేరళ సీఎం

vijayan kerala cm

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వాహనాల రాకపోకల విషయంలో ‘సరి – బేసి’ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.

మహిళలు నడిపే వాహనాలకు మాత్రం ఏ రోజైనా అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జిల్లాలను నాలుజు జోన్ లుగా విభజించి, లాక్ డౌన్ ను అమలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్టు పినరయి వెల్లడించారు.కరోనా కేసులు అధికంగా ఉన్న కసర్ గోడె, కానూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలు తొలి జోన్ లో ఉంటాయని, ఇక్కడ లాక్ డౌన్ నిబంధనలకు ఎటువంటి మినహాయింపూ ఉండబోదని, మే 3 వరకూ ప్రజలంతా లాక్ డౌన్ ను పాయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

పథనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం రెండో జోన్ లో ఉంటాయని, ఇక్కడి హాట్ స్పాట్ లను గుర్తించి, వాటిని సీల్ చేస్తామని తెలిపారు. అలపుళ, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిసూర్, వాయనాడ్ జిల్లాలు మూతో జోన్ లో ఉంటాయని, ఈప్రాంతంలో నిబంధనలకు కొంతమేరకు సడలిస్తామని తెలిపారు. కేరళలలో గురువారం సాయంత్రానికి 394 కేసులు నమోదు కాగా, 147 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంది చికిత్స అనంతరం 245 డిశ్చార్జ్ ఆయ్యారు. కోవిడ్-19 బారినపడి ఇద్దరు మృతిచెందారు.

Related posts