telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాస్ మహారాజాకు నో చెప్పిన బ్యూటీ

Malavika

మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘క్రాక్’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ‘రాక్షసుడు’ సినిమా ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఈ ఆఫర్ కు ఆ భామ నో చెప్పిందట. రజనీకాంత్ ‘పేట’ సినిమాతో పరిచయమైన మాళవిక ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో చేస్తుంది. హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Related posts