telugu navyamedia
తెలంగాణ వార్తలు

గ్యాస్‌, పెట్రోల ధ‌ర‌ల‌పై టీఆర్ ఎస్ రాష్ర్ట‌వ్యాప్తంగా ఆందోళనలు..

*ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ ఎస్ పోరుబాట‌..
*కేంద్రానికి వ్య‌తిరేకంగా నిన‌దాలు..
*గ్యాస్‌, పెట్రోల ధ‌ర‌ల‌పై టీఆర్ ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు
*రోడ్డుపై వంటా వార్పు చేప‌ట్టిన టీఆర్ ఎస్ శ్రేణులు

గ్యాస్‌, పెట్రోల ధ‌ర‌ల‌పై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ ఎస్ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. కేంద్రం లోని బీజేపీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది..

గ్యాస్‌, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు.

ఇందులో భాగంగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే గ్యాస్ సిలిండర్ ఉంచి వంట చేస్తూ నిరసన తెలిపారు టీఆర్ ఎస్ శ్రేణులు.

 

Related posts