telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హరీశ్ నివాసం ముట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం!

harish rao trs

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు సిద్ధిపేటలోని మంత్రి హరీశ్ రావు ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు యత్నించారు.

భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కార్మికులు వారిని తోసుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హరీశ్ నివాసం ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలో కొందరు మహిళా కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Related posts