telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు: ఏ – 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

రాష్ర్ట వ్యాప్తంగా జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ముగిసింది. ఈరోజు ఉదయం మాలిక్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మాలిక్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్నటితో సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ముగిసింది. నాలుగు రోజుల పాటు మాలిక్‌ను పోలీసులు విచారించారు.

మరోవైపు ఈకేసులో మైనర్‌ నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ముగ్గురు మైనర్ల కస్టడీ మంగళవారానికి, మరో ఇద్దరి కస్టడీ బుధవారానికి ముగియనుంది. ఇప్పటి వరకు పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది.

ముఖ్యంగా ఈ ఘటనకు ముఖ్య కారణంగా వారు సాదుద్దీన్‌, కార్పొరేటర్‌ కుమారుడి పేర్లు చెప్పినట్లుసమాచారం. వారిద్దరే తమను రెచ్చగొట్టి.. రేప్‌కు ఉసిగొల్పారని వివరించినట్లు తెలుస్తోంది.
బాలికపట్ల మొదటి నుంచి అమానుషంగా ప్రవర్తించింది.. ఆమెను మొదటగా రేప్‌ చేసింది కార్పొరేటర్‌ కుమారుడే. ఆ తర్వాత సాదుద్దీన్‌ రేప్‌ చేశాడు’’ అని వారు వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది.

Related posts