ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన ఇద్దరి అభ్యర్థులకు బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గెలిచిన తర్వాత కేసీఆర్ నవ్వులు తెలుసు దాని వెనుక రాక్షస ఆనందం తెలుసు అని అన్నారు. బీజేపీ భయానికి కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడిపాడు. కెసీఆర్ కు బిజెపి చుక్కలు చూపించింది. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తెలంగాణ ఉద్యమం లో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల్లో ఏవిధముగా గెలిచారో రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెరాస పార్టీ కి పుట్టగతులు లేవనీ కాంగ్రెస్ పార్టీ కి చెందిన పీవీ నర్సింహ రావు ఫోటో పెట్టుకున్నాడు. ఇవాళ పివి నరసింహారావు గెలిచారా..?కేసీఆర్ గెలిచారా అని ప్రశ్నించాడు. ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తాం.మీ సంఘాలను రద్దు చేస్తాం అని ప్రగతి భవన్ కి పిలిపించి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఉద్యోగులను మానసిక వేదనకు గురి చేసి కోట్ల రూపాయలు వెదజల్లారు. అందుకే ఈ ఎన్నికలో నైతిక విజయం బీజేపీ దే అని బండి తెలిపారు. చూడాలి మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post