telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ ఏయూఈఈటీ 2022 నోటిఫికేషన్ విడుదల ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ ఈఈటీలో (ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏయూఈఈటీ 2022 అర్హత పరీక్షను బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి.

కోర్సులు వారిగా సీట్ల సంఖ్య‌..

బీటెక్+ఎంటెక్ సీఎస్ఈ -360
బీటెక్+ఎంటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ -30
బీటెక్+ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ – 60
బీటెక్+ఎంటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ -30

అర్హతలు, రుసుం ..

ఈ పరీక్షకు ఇంటర్మీడియట్(10+2) లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 45% మార్కులు సాధించాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఏయూఈఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎంట్రన్స్ పరీక్ష అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరి రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://aueet.audoa.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప‌రీక్ష కేంద్రాలు..

విశాఖ‌ప‌ట్నం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, విజ‌య‌వాడ‌, గుంటూరు, తిరుప‌తి, క‌డ‌ప‌
ముఖ్యమైన తేదీలు

ముఖ్య‌మైన తేదీలు..

అప్లై చేసుకోడానికి చివరి తేదీ – జూన్ 22, 2022
హాల్ టికెట్లు డౌన్ లోడ్ తేదీ – జూన్ 28, 2022
ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ – జూన్ 30, 2022
ఫలితాలు ప్రకటన – జులై 2, 2022
అడ్మిషన్లు ప్రారంభం – జులై 8, 2022
ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభమైన తేదీ – మే 22, 2022

Related posts