telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగన్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గుడ్‌న్యూస్..

విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు అదనపు ఆర్థిక వనరుల అవకాశం కల్పించింది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్.విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు గాను తమకు రుణ సదుపాయం కల్పించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.

ఉద్యోగుల పీఆర్సీ, సంక్షేమ పథకాల అమలు, ఫీజు రీయింబర్స్ మెంట్, అభివృద్ధి పథకాల అమలు, ప్రాజెక్టులకు నిధులు వంటి వాటికి ఏపీ ప్రభుత్వం వద్ద నిధులు లేవు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడంతో పాటు కొత్త పెట్టుబడులు కూడా ఏమీ రావడం లేదు. రాజధాని నిర్మాణం కూడా ఆగిపోయింది. అభివృద్ధి విషయంలో ఏపీ చాలా వెనుకడిపోయింది. కొత్తగా ఏమి చేయాలన్నా ప్రభుత్వానికి ఆర్థిక లోటు అడ్డంకిగా మారింది.

దీంతో ఏపీ ప్రభుత్వానికి కొంత రిలీఫ్ చేకూరనుంది. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జగన్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు రూ.2,123 కోట్ల ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.

దీంతో ఏపీకి 2,123 కోట్ల రూపాయలు , రాజస్థాన్ కు 5,186 కోట్ల రూపాయలు, రుణ సదుపాయం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేసిన తమకు కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలని ప్రతిపాదనలను 9 రాష్ట్రాలు పంపాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది జగన్ ప్రభుత్వం. ప్రతి నెలా 15వ తారీఖున జీతాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరైన సమయంలో అందటం లేదు.

Related posts