తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిశ దారుణ ఘటనపై దేశమంతా స్పందించినా కేసీఆర్ మాత్రం స్పందించట్లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వల్లే రాష్ట్రంలో ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో మద్యం, మాదక ద్రవ్యాలను నియంత్రించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధంపై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. మహిళా సంకల్ప దీక్ష పేరుతో ఈ నెల 11, 12 తేదీల్లో ఇందిరా పార్కు వద్దనిర్వహిస్తోన్న దీక్షకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని ఆమె కోరారు.
రాజకీయాల కోసం రెచ్చగొట్టడం మానుకోవాలి: ఇంద్రకరణ్‌రెడ్డి