telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రజాతీర్పుకి మేం కట్టుబడి ఉంటాం : కన్నబాబు

Ycp Kannababu

ప్రజాతీర్పుకి మేం కట్టుబడి ఉంటామని మంత్రి కన్నబాబు అన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను గౌరవిస్తామని… కానీ వీటన్నిటి కన్నా ప్రజాతీర్పుకి మేం కట్టుబడి ఉంటామని.. ఈ సమయంలో ఎన్నికలంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం తప్ప మరోటి కాదని తెలిపారు. ఉద్యోగులు కూడా ఎన్నికలకు మేము సంసిద్ధంగా లేమని అంటున్నారని… కానీ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఆయన అహంభావాన్ని పట్టుదలను చూపించుకోవడం కోసం అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నిమ్మగడ్డ మొదటి నుంచి ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని…ఆయన వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నారు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. చంద్రబాబు హయాంలో లేని రాజ్యాంగ సంక్షోభం ఈ రోజు వస్తుందని నిమ్మగడ్డ ఎందుకు ఆలోచిస్తున్నారని.. చంద్రబాబు హయాంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు. రేపు తిరుపతి ఎన్నిక వస్తే టీడీపీకి పుట్టగతులు ఉండవని… పదవిలో ఉండగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న పట్టుదల నిమ్మగడ్డది అని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు రోజుకో విధంగా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని… సిగ్గు లేని రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీకి ప్రజారోగ్యం పట్టదా.. ఐఏఎస్ అధికారి కుట్రలో భాగస్వాములు అయితే ఎలా అని నిలదీశారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే చంకలు గుద్దుకునే బ్యాచ్లో చంద్రబాబు, నిమ్మగడ్డ లాంటివారు తయారయ్యారని ఫైర్‌ అయ్యారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts