telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓడిపోతే గెలవడం నేర్చుకో…

జీవితంలో కష్టము,
కన్నీళ్ళు, సంతోషము,
బాధ ఏవి శాశ్వతంగా ఉండవు

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.
ఆనందం, ఆవేదన కూడా అంతే.

నవ్వులూ, కన్నీళ్ళూ
కలగలసినదే జీవితం.

కష్టమూ శాశ్వతం కాదు,
సంతోషమూ శాశ్వతమూ కాదు.

………………………………………

ఓడిపోతే
గెలవడం నేర్చుకోవాలి,

మోసపోతే
జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి,

చెడిపోతే ఎలా
బాగుపడాలో నేర్చుకోవాలి,

గెలుపును ఎలా పట్టుకోవాలో
తెలిసిన వాడికంటే
ఓటమిని ఎలా
తట్టుకోవాలో తెలిసిన వారే
గొప్ప వారు నేస్తమా !

……………………………..

దెబ్బలు తిన్న రాయి
విగ్రహంగా మారుతుంది

కానీ దెబ్బలు కొట్టిన
సుత్తి మాత్రం ఎప్పటికీ
సుత్తిగానే మిగిలిపోతుంది….

ఎదురు దెబ్బలు తిన్నవాడు,
నొప్పి విలువ తెలిసిన వాడు
మహనీయుడు అవుతాడు…

ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు
ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు…

Related posts