సెప్లెంబర్ 5 నుంచి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జగన్ అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత వరకు ఇసుక నిల్వలు పెంచాలని, సరైన స్టాక్‌యార్డుల్లో ఇసుకను పూర్తి స్థాయిలో నింపాలని అన్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లు కన్నా తక్కువ రేట్లకు ఇసుకను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇసుక రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఇసుక అందుబాటులో ఉంటే ఆటోమేటిక్‌గా ధరలు తగ్గుతాయని అన్నారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు చెప్పడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలున్నచోట కొత్త రీచ్ లు తీసుకురండి అంటూ అధికారులకు సూచించారు.