telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌పై టీఆర్ఎస్ కీల‌క మంత‌నాలు..యశ్వంత్ సిన్హాకే మద్దతు..!

*రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌పై టీఆర్ఎస్ కీల‌క మంత‌నాలు
*య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ఇచ్చే యోచ‌న‌లో టీఆ ర్ ఎస్‌..
*ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో పార్టీ ముఖ్య నేత‌ల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌లు
*బీజేపీయేత‌ర అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం 

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఇప్పటికే పలువురు టిఆర్ఎస్ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు
యోచ‌న‌లో ఉంది . మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్ర‌క‌టించ‌నుంది 

ఈ క్ర‌మంలో  సీఎం కేసీఆర్ తో ఫోన్ లో శరద్ పవార్ మాట్లాడారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కేసీఆర్…యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారని శరద్ పవార్ వెల్ల‌డించారు.

అయితే, టీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ కు దూరం యశ్వంత్ సిన్హా పాటిస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ కు దూరం పాటించామన్న మెసేజ్ ప్రజలకు పంపే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రి కాసేప‌ట్లో కేసీఆర్ వ్యూహం ఏమిటో తెలియ‌నుంది.

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్‌సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలో ఈ సమావేశం జ‌రిగింది. విప‌క్షాల నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ ప్ర‌క‌టించారు. విపక్షాలకు చెందిన 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి.

ప్ర‌స్తుతం తృణ‌మూల్ పార్టీలో కొన‌సాగుతున్న య‌శ్వంత్ సిన్హా.. ఇవాళ ఉద‌యం ఆ పార్టీకి రాజీనామా చేసిన‌విష‌యం తెలిసిందే

Related posts