telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్లమ్ ఏరియాల్లో ఉంటున్న పేదలను ఆదుకుంటున్నఅమితాబ్

Amitab Bachchan Tweet on RGV

కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు కరోనా పై పోరులో సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్.. లాక్‌డౌన్ కారణంగా పని లేకుండా పోయిన లక్ష మంది ప్రజలకు ఒక నెలకు సంబంధించిన నిత్యావసరాలు అందించేందుకు ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్‌‌తో కలిసి ముందుకు వచ్చారు. తాజాగా ఆయన ఉత్తర ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఉంటున్న పేదలకు రెండు వేల ఆహార పొట్లాలను పంచారు. అలాగే మూడు వేల మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేసారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అంతేకాదు త్వరలో ఇంట్లో నలుగురు సభ్యులు చొప్పున నాలుగు లక్షల మందిని నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ఇవ్వాలనేది నా ప్రయత్నం అంటూ అమితాబ్ వెల్లడించారు.

Related posts