telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

rains in telugu states today

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో వరద నీరు పారుతుంది. సాయంత్రం కావడంతో విధులు ముగించుకొని ఇంటికి చేరేందుకు ఉద్యోగులు వాహనాల పై ఒకే సమయానికి బయలుదేరడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేస్తున్నారు. వర్షంతో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ ఎంసీ ముందస్తు ఏర్పాట్లను చేసింది.

Related posts