telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిలిచిపోయిన “ఆరోగ్యశ్రీ” .. రూ. 1500 కోట్ల బకాయిలు!

aarogyasri telanana

నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్యశ్రీ” పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బయాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 242 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి.

ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరించాయి. బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించలంటూ ఆందోళనకు దిగాయి. ప్యాకేజీ రేట్లను సవరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ మధ్యాహ్నం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీకానున్నారు.

Related posts