మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించారు.
” మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి నా నివాళులు” అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.
మాజీ మంత్రి చిదంబర్, సచిన్ పైలట్ వంటి ఇతర నాయకులు కూడా ఢిల్లీలో మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.