telugu navyamedia
రాజకీయ

హైదరాబాద్​లో జోరు వాన..

హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజాము నుంచి జోరువాన కురుస్తున్నది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జోరువానలతో హైదరాబాద్ తడిసిముద్దవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Rain lashes Hyd, IMD issues orange alert in TS- The New Indian Express

ఎడతెరిపి లేని వర్షంతో రహదారులపై భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Telangana: KCR calls for permanent solution to floods as heavy rain continues to batter state | Cities News,The Indian Express

హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, అమీర్‌పేట్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం పడుతున్నది. అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గండిపేట్, మొయినాబాద్‌ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వాన పడుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.

Rains wrecks havoc in city affecting the West zone of Hyderabad

కాగా, రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి కింది‌స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఈ నెల 29 వరకు తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని తెలిపింది. పలు జిల్లా‌లకు ఎల్లో హెచ్చరిక జారీ‌చే‌సింది.

Related posts