telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

స్వీట్‌ కార్న్‌ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి !

తియ్యటి మక్కజొన్న అందేనండి.. స్వీట్‌ కార్న్‌. ప్రస్తుత కాలంలో ఎక్కువగా లభిస్తుంది. సిటీ అవతల వైపు రోడ్లపై, పార్కల వద్ద స్వీట్‌ కార్న్‌ ఎక్కువ లభిస్తున్నాయి. అయితే.. ఇవి తింటే మన ఆరోగ్యానికి ఎంతో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రయోజనాలు
తియ్యటి మక్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక స్వీట్‌కార్న్‌ అంటేనే ఫైబర్‌కు చిరునామాగా చెప్పవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మలబద్దకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్‌ మంచి పరిష్కారమని చెప్పవచ్చు. స్వీట్‌కార్న్‌లలో ఉండే విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లైవనాయిడ్స్‌ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్‌ బి-12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్‌పెడుతాయి. అదేవిధంగా తియ్యటి మక్కజొన్న ల్లోని ఫాస్పరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజాలు ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. నిత్యం ఒత్తిళ్లలో పనిచేసే వారికి స్వీట్‌కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫినోలిక్‌ ఫైటోకెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. స్వీట్‌కార్న్‌లు చాలా వేగంగా జీర్ణమవుతాయి. అందువల్ల శరీరానికి తక్షణమే కావాల్సినంత శక్తి వస్తుంది.

Related posts