telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాకాశి రాత్రి… గడవని రాత్రి

నిద్రిత ధాత్రిలో
జాలి చూపుల రాత్రి
బయపెడుతున్న రాత్రి
వేదనలని, వ్యధలని చొప్పే రాత్రి
గుండె నెరల్లో చొచ్చుకున్న రాత్రి
రాకాశి రాత్రి
గడవని రాత్రి
ధీనంగా చూస్తోంది
నిద్రపోనివ్వకుండా
బయపెడుతోంది
భవిష్యత్తులేని నీగతం
ఏంటని ప్రశ్నిస్తోంది
వెన్నెల విరగబడి నవ్వుతోంది
నేటి కర్ణుడివంటూ వెక్కిరిస్తోంది
జన్మకి కారకులేవరో చెప్పమంటోంది
విషం నిండిన గుండెలో చితిమంటలే రగిలిస్తోంది
ఆకాశ తారల కూనిరాగాలేవో వేదిస్తున్నవి
పిల్లగాలుల తరగలు జాలి పడుతూ తాకుతున్నవి
రాక్షస గబ్బిలాల కీచు కీచు శబ్దాలు
పుండును గుచ్చే కాకుల గుసగుసలు
హృదయానికి ఫిరంగులై తాకిన జాడలు
పుట్టుకకు సాక్షమే లేని ప్రశ్నలు
కన్నీటిధారలే సమాధానాలు
విషాదాన్ని, భయాన్ని కలిగిస్తూ
నిశ్శబ్ద ఏకాంతం మెల్లగా నడుస్తోంది
మూడడుగులు పడక మునుపే
ఏడు అడుగులు నడవక మునుపే
తొమ్మిది నెలలు మోసిన పాపపు
పిండానివంటూ హేళన చేస్తోంది
అడుగునున్న విషాదాన్ని వెలికితీస్తూ
నేనెవరన్న నిఘాడ రహస్యం చెప్పలేని
నా దుస్థితి చూసి జాలైనా లేకుండా నవ్వుకుంటూ
నిశీధి నీడల్లో మాలినాన్ని అంటించి
రాత్రి మెల్లగా జారుకుంది

Related posts