telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు పెడతాం..దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు

మూడు రాజధానులు ఏర్పాటు వైసీపీ ప్రభుత్వం లక్ష్యం.. పాదయాత్ర పేరుతో విశాఖలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు వెళ్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు

అమరావతిని మహానగరాలతో పోల్చి చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని. 23 సీట్లకే టీడీపీని పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని నాని ఫైరయ్యారు. 29 నియోజకవర్గాలున్న హైదరాబాద్ ఎక్కడ? …? 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.

వైజాగ్ సిటీలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయని.. అక్కడ పదివేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తుందని కొడాలి నాని అన్నారు.

ముంబై, చెన్నై లాంటి ప్రాంతాలతో 25 గ్రామాలను ఎప్పటికి అభివృద్ధి చేస్తావు .అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి జరగదని అని అన్నారు. తమ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

పరిపాలనా రాజధానిని విశాఖకు తీసుకెళ్లడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ పరిపాలన రాజధానైతే ఆ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కొడాలి నాని పేర్కొన్నారు. మాకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు కూడా అంతేనని మాజీ మంత్రి స్పష్టం చేశారు

తమకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు అంతేనని కొడాలి నాని అన్నారు. విశాఖ అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సృష్టించవచ్చు.. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన రాజధాని వైజాగ్ తీసుకెళ్తాం..దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.

టెక్నికల్ గా తాము బిల్లును ఉపసంహరించుకున్నామని, అటువంటి అప్పుుడు పాదయాత్ర ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంపై దాడి చేయడానికి వెళుతున్నారా? అని ప్రశ్నించారు.

ఈ అసెంబ్లీలో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు పెడతాం.. వచ్చే ఎన్నికల కంటే ముందే విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తామని అన్నారు.

అక్కడ అల్లర్లు జరిగితే ఆ మంటల్లో చంద్రబాబు చలి కాచుకుంటారన్నారు. వైసీపీ మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు

Related posts