జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, నాలుగు నెలల పాటు దీక్షను చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ నాలుగు నెలలూ ఆయన ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తారు.
ఈ దీక్షను పూర్తి చేసే క్రమంలో నిత్యమూ నియమబద్ధ జీవితాన్ని గడపనున్నారు. కాగా, ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్న ఆయన, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.