telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మోదీకి మద్దతుగా కేసీఆర్: రాహుల్ 

rahul gandhi to ap on 31st
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌ గాంధీ అన్నారు. సోమవారం జహీరాబాద్‌లో నిర్వహించిన  ఎన్నికల ప్రచార సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి విషయంలో ప్రధాని  మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని  రాహుల్ దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్‌ను రిమోట్ కంట్రోల్‌తో మోడీ నడుపుతున్నాడని రాహుల్ ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేయడం లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు.
నీరవ్ మోడీకి,  అనిల్ అంబానీకి, విజయ్ మాల్యాకు ప్రధాని మోదీ చౌకీదారుగా మారాడని ఆయన ఆరోపించారు. దేశాన్ని ముంచిన వారికి యన  సేవకుడిగా మారాడని ఆయన విమర్శించారు.  15 మంది కోసమే ప్రధాని పనిచేశారని ఆయన ఆరోపించారు.  15 లక్షలను ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో వేస్తానని హామీ ఇచ్చారు. మరో వైపు ప్రతి ఏటా రెండు కోట్ల  ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో మోదీ నెంబర్ వన్ అని రాహుల్ విమర్శించారు. దేశంలోని పేదలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయం చేస్తోందని ఆయన ప్రకటించారు. పేదలకు ప్రతి నెల రూ. 12వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ఆయన ప్రకటించారు.  

Related posts