telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అద్భుతమంటే ఇదే… ప్రమాదం జరిగి మూడ్రోజులకు కూడా వృద్ధుడు…!!

Man

మాంట్రోస్ కౌంటీ, కొలరాడోలో ఓ అరుదైన ఘటన జరిగింది. రాబర్ట్ మెక్‌లెరోయ్ (82) అనే వృద్ధుడు సోమవారం ఉదయం 10 గంటలకు తాను నివాసముండే నుక్ల నుంచి గ్రాండ్ జంక్షన్‌కు కారులో బయల్దేరాడు. అయితే హైవే 141 పరివాహక ప్రాంతంలోని సాన్ మిగ్యెల్ నది ఒడ్డున అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దాంతో కారు పల్టీలు కొట్టి నది నీటి అంచుల వద్ద వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు కారు నుంచి బయటకు రాలేకపోయాడు. అలా మూడు రోజులు గడిచిపోయాయి. బయటికి వెళ్లిన తాత తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన మనవడు ఏతాన్ ఆర్చర్ మాంట్రోస్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తాతయ్య గత మూడు రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్ ద్వారా రాబర్ట్ వెళ్లిన మార్గంలో అతడి ఆచూకీ కోసం గాలించారు. మనవడు ఆర్చర్ అనుమానంతో సాన్ మిగ్యెల్ నది తీర ప్రాంతంలో చిన్న పడవపై తాత కోసం వెతకడం మొదలెట్టాడు. ఈ క్రమంలో రాబర్ట్ కారుతో సహా మిగ్యెల్ నది నీటి అంచున పడి ఉండడం ఆర్చర్ గుర్తించాడు. దాంతో వెంటనే పోలీసుల సహాయంతో అతడ్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచిన వృద్ధుడు బతికి ఉండడం మిరాకిల్ అని మాంట్రోస్ కౌంటీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రాబర్ట్ కోలుకుంటున్నాడని పోలీసులు చెప్పారు.

Related posts