telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2,216 మందికి పాజిటివ్

corona covid

తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో దూసుకుపోతోంది. రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు నమోదుకాగా..11 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,57,096కి చేరింది. చికిత్స నుంచి కోలుకుని 1,24,258 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 961 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 341 కేసులు నమోదయ్యాయి.

Related posts