telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశంలో ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయింది: సీపీఐ నేత చాడ

chada venkat reddy cpi

దేశంలోని ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. కశ్మీర్‌ విషయంలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని తలపించేలా ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఆర్థికమాంద్యంతో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు జరగడం లేదని, కార్మికుల హక్కులపై కేంద్రం దాడి చేస్తుందని మండిపడ్డారు.

కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 24న కోల్‌ ఇండియా కార్మికులు ఎనిమిది లక్షలమంది సమ్మె నిర్వహించారని గుర్తు చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ అమలు కాకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దివాలాకోరు విధానాలను నిరసిస్తూ అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Related posts