“నా పేరు సూర్య”తో భారీ డిజాస్టర్ ను చూసిన అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇటీవల త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ ను అందుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఈ రోజున అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
My Second musical journey with #guruji #Trivikram sir ♥️
Can’t get a better opportunity to show my love and respect towards his brilliant writing 🍀
And #radhakrishna gaaru @haarikahassine
My hattrick with our Very own #StylishStar @alluarjun ♥️
God bless 🍀 pic.twitter.com/MnTRLC2mkC
— thaman S (@MusicThaman) April 8, 2019
పవన్ కు వ్యతిరేకంగా మేము ప్లాన్ చేయలేదు… ట్రోల్ చేయకండి : రాజశేఖర్