telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతు చట్టాలపై వెనక్కి తగ్గేదే లేదంటున్న రైతు సంఘాలు !

గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్‌పథ్‌లోనే 6 వేల మంది సాయుధ పోలీసుల్ని దించారు. ర్యాలీకి లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు తరలించాలని భావించినా… కేవలం ఐదు వేల ట్రాక్టర్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే.. ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే..ఈ ర్యాలీలో ఓ రైతు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కొత్తసాగు చట్టాలపై వెనక్కి వెళ్లబోమని.. శాంతియుతంగానే ఆందోళన చేస్తామని రైతు సంఘాలు తెలిపాయి. కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ కుట్రకు బలైందని రైతులు సంఘాలు పేర్కొన్నాయి. ఎర్రకోట మార్గం మా పరేడ్‌ లో భాగం కాదని.. కుట్రపూరితంగానే రైతుల కవాతును విచ్ఛిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి రైతు సంఘాలు. 99 శాతం రైతులు శాంతియుతంగానే ర్యాలీలో పాల్గొన్నారని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ కమిటీని ముందు పెట్టి.. ఉద్రిక్తతలు జరిగేలా చేశారని తెలిపాయి. ఈ నెల 30 న గాంధీ వర్ధంతికి దేశవ్యాప్తంగా జనసభలు నిర్వహిస్తామని..అదే రోజున నిరాహార దీక్షలు నిర్వహిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. నిన్నటి ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరి 1న చేపట్టబోయే రైతుల పార్లమెంటు కవాతు రద్దు చేసుకుంటున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి.

Related posts