telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గత ప్రభుత్వంలో అంగన్‌ వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేశారు: మంత్రి వనిత

vanitha tatineni minister

గత ప్రభుత్వ హయాంలో అంగన్‌ వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేశారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాసిరకంగా ఇచ్చారన్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు, పౌష్టికాహారం కూడా నాసిరకంగా అందించి అవినీతికి పాల్పడ్డారని ఆరోప్పించారు.

నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పిల్లలు, గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 53శాతం మహిళలకు రక్తహీనత ఉంది. దానిని తగ్గించేందుకు సరైన పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

Related posts