ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతలు ఐవీ సుబ్బారావు, అంబటి ఆంజనేయులు కలిశారు. జర్నలిస్టులపై దాడులు, కేసుల దర్యాప్తులో లోపాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తునిలో సత్యనారాయణ హత్య, శ్రీకాకుళం జిల్లా జులుమూరు రిపోర్టర్ కరుణవీరుడిపై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు డీజీపీకి వివరించారు. జర్నలిస్టులకు పూర్తి రక్షణ కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. కేసుల విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్‌శాఖ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
previous post
ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పూజా…