రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారి పై మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని తెలుస్తోంది.
previous post
next post
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల