telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిన్న కాంగ్రెస్ కి .. నేడు బీజేపీతో సై అన్న జేడీఎస్ .. వారిని ఇవన్నీ మాములే..

deva gouda jds

కర్ణాటక రాష్ట్ర రాజకీయ తెరపైకి కొత్త స్నేహం పుట్టుకొచ్చింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా పెను కుతూహలం రేకెత్తిస్తున్న అనర్హ ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, డిసెంబరు 5న జరుగనున్న 15 నియోజకవర్గాల ఫలితాలు ఎలా వచ్చినా యడియూరప్ప ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు ఉండదు. బీజేపీ ప్రభుత్వం కూలిపోకుండా మధ్యంతర ఎన్నికలకు తావులేకుండా జేడీఎస్‌ అనూహ్య రీతిలో చక్రం తిప్పింది. ప్రారంభంలో యడ్డీ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వాలని తద్వారా విరివిగా గ్రాంట్లు రాబట్టు కోవాలని దళపతి పక్కా ప్లాన్‌ వేసినట్టు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామిలు నాటకీయంగా భేటీ కావడమే కాకుండా సుదీర్ఘ చర్చలు జరిపారు. అప్పుడే ఈ కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేచింది. దీని కొనసాగింపులో భాగంగా జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ రెండు రోజులక్రితం ముఖ్యమంత్రి యడియూరప్పకు ఫోన్‌ చేసి ఈమేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ఇక్కడి రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది.

కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రె్‌సకు చెందిన సిద్దరామయ్య వ్యూహాత్మకంగానే కూల్చివేశారని భావిస్తున్న దేవేగౌడ తన అపర చాణుక్యనీతిని మరోమారు ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలని ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రె్‌సను చావుదెబ్బ తీసినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ తాజా పరిణామాలతో సుప్రీంకోర్టులో అనర్హ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలినా, డిసెంబరు 5న జరుగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థానాలు గెలవలేకపోయినా ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండబోదు. ప్రారంభంలో బయటనుంచి మద్దతు ఇవ్వాలని తద్వారా ప్రభుత్వ సహకారంతో తమ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు విరివిగా గ్రాంట్లు రాబట్టుకోవాలని దళపతి పక్కా ప్లాన్‌ వేసినట్టు సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు బీజేపీలోకి జంప్‌ అయ్యేందుకు గోడమీద పిల్లివాటంలా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు ముకుతాడు వేయడంతోపాటు పరోక్షంగా అధికార పగ్గాలు చేపట్టేలా చాణుక్యనీతిని రూపొందించారు.

Related posts