2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. అనంతరం కొంతకాలానికే అధికార టీఆర్ఎస్ లో శ్రీనివాసరెడ్డి చేరారు. పార్టీ మారినప్పటికీ, జగన్ పై అభిమానాన్ని చూపిస్తూ వచ్చిన పొంగులేటికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని జగన్ ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించే ఆనవాయితీలో భాగంగా తెలంగాణ నుంచి పొంగులేటిని నామినేట్ చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.