telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో భూముల రీ-సర్వేకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్…

Ycp Kannababu

ఇవాళ ఏపీ సుమారు కెబినెట్ భేటీ ఐన విషయం తెలిసిందే. ఈ భేటీ మూడున్నర గంటలకు పైగా కొనసాగింది. ఈ కాబినెట్ భేటీపై మంత్రి కన్నబాబు మాట్లాడారు. మెరుగైన ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలిపిందని.. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 500 లీటర్ల కంటే ఎక్కువగా పాల సేకరణకు అవకాశం ఉన్న సుమారు 9 వేలకు పైగా గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వేకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే చేస్తామని…రీ-సర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయింపు చేశామన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీ-సర్వే పూర్తి అవుతుందని పేర్కొన్నారు. 4500 సర్వే టీములను సిద్దం చేస్తున్నామని…రీ-సర్వేలో ఉత్పన్నమయ్యే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తాం.. సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు…100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నామని తెలిపారు.

Related posts