telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఒంగోలులో నిర్వహించేది టీడీపీ మహానాడు కాదు, అది వల్ల కాడు ..

ఒంగోలులో నిర్వహించేది టీడీపీ మహానాడు కాదు, అది వల్ల కాడు అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కింది చంద్రబాబు అని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విప్లవంలో టీడీపీ సహా ఆ పార్టీతో  పొత్తున్న పార్టీలు కూడా కొట్టుకుపోతాయని తమ్మినేని సీతారాం జోస్యం చెప్పారు. 

రెండో రోజు ఏపీ మంత్రుల‌ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభ‌మైంది. విశాఖపట్టణం జిల్లాలోని పాత గాజు వాక జంక్ష‌న్ నుంచి యాత్ర మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు..దళిత కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్ర‌బాబు నాయుదు గతంలో వ్యాఖ్యానించారని తమ్మనేని సీతారాం చెప్పారు.

బస్సు యాత్రకి స్పందన లేదనడం చంద్రబాబు అవివేకం. ప్రతీ చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తున్నారు’’ అని తెలిపారు.నాయిబ్రహ్మణులు తమ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వెళ్తే మీ తోకలు కత్తిరిస్తానని వ్యాఖ్యానించారని తమ్మినేని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో వైపు బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖ రాశాడని తమ్మినేని విమర్శలు చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తలెత్తుకునేలా వైఎస్ జ‌గ‌న్‌ సామాజిక న్యాయం చేశారని త‌మ్మినేని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఆర్ధికంగా ఎదిగేందుకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని స్పీకర్ గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

కోన‌సీమ‌కు అంబేద్కర్ పేరు పెడితే తప్పా అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎందుకు అల్లర్లు సృష్టిస్తున్నాయని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ అల్లర్లకు ప్రభుత్వే బాధ్యత వహించాలంటున్నారు. మీకు బాధ్యత లేదా అని విపక్షాలను ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టమైంది. అరెస్ట్ అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారు. ఆధారాలు, ఫొటోలు, వీడియోలతో ఆధారంగా వారిని అరెస్ట్‌ చేశాము. చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. నేను వీళ్ళ పాత్ర ఉందని ముందే చెప్పాన అని త‌మ్మినేని అన్నారు. మన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకొనేందుకు వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.

Related posts