వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమన్న భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అందుకే, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకొంటోందని మండిపడ్డారు. ఇలా అడ్డుకున్న ప్రతిచోట ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కోర్టులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.
టీడీపీ నేతల నివాసాల్లో మద్యం సీసాలు పెట్టించి వారిపై అక్రమకేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నిన్న మాచర్లలో టీడీపీ నాయకుల పర్యటనపై విమర్శలు గుప్పించిన మంత్రి బొత్స సత్యనారాయణపై ఆయన ధ్వజమెత్తారు. తమ నాయకుల పర్యటన గురించి ప్రశ్నించేందుకు ఆయన ఎవరని మండిపడ్డారు.