telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దీపావళి టపాసులు బ్యాన్ చేసిన రాష్ట్రాలు ఇవే..

మన దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా కరోనా వైరస్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడి జాగ్రత్తలరీత్యా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీపావళి సమీపిస్తున్న వేళ.. టపాసులపై నిషేధాన్ని విధిస్తూ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. నగరంలో కరోనా పరిస్థితి, సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీక్షించారు. అనంతరం ఆ నిర్ణయాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి రోజున ఎవ్వరూ బాణసంచాను కాల్చకూడదని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరూ కలిసి దీపావళిని జరుపుకుందాం అని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. గతేడాది కూడా బాణసంచా కాల్చకుండానే దీపావళి పండుగ జరుపుకొన్నామని సీఎం కేజ్రీవాల్ గుర్తుచేశారు. అదేవిధంగా ఈసారి కూడా జరుపుకోవాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీతో పాటుగా పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీపావళికి టపాసులు కాల్చొద్దని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలు టపాసులను పూర్తిగా నిషేధించగా.. మరికొన్ని స్టేట్స్ ఇంపోర్టెడ్ క్రాకర్స్‌‌ను బ్యాన్ చేశాయి.

Related posts