telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పవన్ డిమాండ్

pawan

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులకు వేల కోట్ల నిధులు ఇస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప, ఎంత ఇచ్చారో స్పష్టత లేదని విమర్శించారు. అసలు ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ కు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారో శ్వేత పత్రంలో వెల్లడించాలని తెలిపారు. కాపుల దృష్టి మరల్చేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరిన్ని తెలివితేటలతో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా అది కాపులను ఉద్ధరించడానికే అని గొప్పలు పోతోందని పవన్ దుయ్యబట్టారు. అప్పటి సర్కారు కాపు కార్పొరేషన్ కు ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని ప్రకటిస్తే, వైసీపీ సర్కారు ఓ అడుగు ముందుకేసి రూ.2 వేల కోట్లు ప్రకటించింది. గత 13 నెలల కాలంలో కాపుల కోసం రూ.4,770 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ అంటున్నారు. ఈ నిధులను రాష్ట్రంలో అందరితో కలిపి ఇచ్చారా, లేక ప్రత్యేకంగా కాపులకే ఇచ్చారా అనేది వైసీపీ ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా ప్రకటించడంలేదని విమర్శించారు.

Related posts