టీంఇండియా రిజర్వ్ బెంచ్ బలంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసాక.. భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. అదే శ్రీలంక పర్యటన. ఈ టూర్ కోసం బీసీసీఐ త్వరలోనే మరో జట్టును ప్రకటించనుంది. అయితే కోహ్లీ నేతృత్వంలో 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంటే, అంతే బలమైన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్దమవడం చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఈ ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు భారతదేశం ఏమి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియా దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం చేసింది. కానీ వారు అందులో విజయం సాధించలేకపోయారు. మొదటిసారిగా ఒక జాతీయ క్రికెట్ జట్టు రెండు వేర్వేరు సిరీస్‌లు ఆడబోతోందని నేను భావిస్తున్నా. ఒకే దేశంలో రెండు బలమైన జాతీయ జట్లు అంటే మాములు విషయం కాదు’ అని ఇంజమామ్ ఉల్ హాక్ అన్నారు.
previous post
హైద్రాబాద్ అభివృద్దికి వైఎస్ ఏనాడు అడ్డుపడలేదు: చంద్రబాబు