telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులపై కఠినంగా ప్రవర్తిస్తున్నారు.. : ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా

roja ycp mla

ఆర్టీసీ సమ్మెపై ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా స్పందించారు. కేసీఆర్ నిర్దాక్షణ్యంగా ఆర్టీసీ కార్మికుల నుంచి ఉద్యోగాల్లో నుంచి తొలగించారు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఆర్టీసీ కార్మికులు అదృష్టవంతులని.. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం అయ్యారని ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణలో జరుగుతున్న సమ్మెతో పాటూ తాజా పరిణామాలపై కూడా స్పందించారు. ఏపీలో ఎలాంటి ఉద్యమం లేకపోయినా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు అని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చెప్పారని..అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని నిలపెట్టు కోవడం జరిగింది అని తెలియచేశారు. న్యాయమైన కోరికగా భావించి.. మాటను నిలబెట్టుకొని.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు వచ్చేలాగా చేశారు అని అన్నారు.

తెలంగాణలో ఉద్యమం చేస్తున్నా అక్కడి ముఖ్యమంత్రి కార్మికుల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు అని రోజా ఆరోపణలు చేశారు. వైఎస్సార్, జగన్ వల్లే ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్టీసీ కార్మికులు అండగా నిలబడాలని కోరారు. ఎమ్మెల్యే రోజా కేసీఆర్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు చాల ఆసక్తిగా మారాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసీ ఈ స్థాయిలో బలంగా ఉందంటే… అందుకు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం అని అన్నారు. వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌ను బలోపేతం చేస్తున్న పార్టీ కార్మిక సంఘం నాయకుల కృషిని ఈ సందర్భంగా రోజా ప్రశంసించారు.

Related posts